కోలీవుడ్ దర్శకుల నిర్ణయానికి హాట్సాఫ్!

November 25, 2015 | 12:11 PM | 1 Views
ప్రింట్ కామెంట్
62_directors_organs_donation_jayalalitha_niharonline

సినిమాల ద్వారా జనాలను ఎంటర్ టైన్ చేయటం వరకే తమ బాధ్యత తీరిపోయిందనుకుంటారు కొందరు డైరక్టర్లు. హీరోలను తమ తమ అభిమానులకు తగ్గట్లుగా చూపించేసి, కోట్లకు కోట్లు వెనుకేసుకోవటంతో సరిపెట్టుకుంటున్నారు మరి కొందరు. అయితే మన దర్శకుల్లో చాలా మందికి సామాజిక స్పృహ తక్కువనేది ఒప్పుకోవాల్సిన నిజం. డబ్బులు తీసుకోకుండా అలాంటి ప్రోగ్రాంలో ఎంత మంది పాల్గొంటారనేది వేళ్ల మీద లెక్కపెట్టుకోవచ్చు.  అలాంటిది ఏకంగా  62 మంది కోలీవుడ్ దర్శకులు విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుని ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు.

మరణానంతరం వారు తమ అవయవాలను పరిశోధనల నిమిత్తం దానం చేస్తున్నట్టు ప్రకటించారు. తమిళ చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్, కేఎస్ రవికుమార్, వాసు, ఆర్కే సెల్వమణి ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలిసి అవయవదాన అంగీకార పత్రాలు అందజేశారు. కోలీవుడ్ దర్శకులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని జయలలిత అభినందించారు. కమల హాసన్ స్పూర్తిగా తాను చేసిన ప్రతిపాదనను దర్శకులంతా సమర్థించి అంగీకరించారని విక్రమన్ తెలిపారు. మరణానంతరం శరీరాలు దానం చేయడంపై అందరికీ అవగాహన కల్పిస్తామని వారంతా చెబుతున్నారు. మరి మనోళ్లు కూడా ఇలాంటిది ఏదైనా చేస్తే బావుంటుందేమో కదా!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ