షూటింగ్ దశలో బాహుబలి-2 గురించి రోజుకో న్యూస్. అవి నిజమో కాదో చిత్ర యూనిట్ కూడా స్పందిచకపోవటంతో ప్రేక్షకుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ప్రస్తుతం కేరళలో ఓ షెడ్యూల్ పూర్తిచేసుకున్న కంక్లూజన్ ప్రస్తుతం ఇక్కడ షూటింగ్ జరుపుకుంటోంది. మొదటి పార్ట్ సౌత్ నార్త్ తో తేడా లేకుండా దేశం మొత్తం కలెక్షన్లు కుమ్మేసింది. వారం లేటుగా వచ్చిన సల్మాన్ భజిరంగి భాయ్ జాన్ చిత్రాన్ని తట్టుకుని మరీ 600 కోట్లు వసూలు చేసిందంటే మాములు విషయం కాదు కదా. అలాంటి చిత్రం రెండో పార్ట్ పై ఇప్పుడు బాలీవుడ్ లోనూ అంచనాలు పెరిగాయి.
ఈ దశలో బాహుబలి గురించి వచ్చే ఏ న్యూస్ అయినా బాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. అమీర్ ఖాన్ 'దంగల్' సినిమా ఈ ఏడాది క్రిస్మస్ రోజున విడుదల కానుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న బాహుబలి-2 కూడా అప్పటి లోపు షూటింగ్ పూర్తి చేసుకుని క్రిస్మస్ రోజునే విడుదల కాబోతుందనది ఓ వార్త అక్కడ షికారు చేస్తోంది.
నిజానికి ఫలానా రోజున విడుదల చేయనున్నట్టుగా రాజమౌళి నుంచిగానీ, చిత్ర యూనిట్ నుంచి గానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. చాలా గ్యాప్ తర్వాత అమీర్ నుంచి వస్తున్న చిత్రం కావటంతో భారీ పోటీ తప్పదని చెప్పుకుంటున్నారు. బాహుబలి ఈ యేడాది వచ్చేది కష్టమని మనందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ బాలీవుడ్ ఆత్రుతతో ఈ ఫేక్ న్యూస్ పుట్టుకొచ్చి చక్కర్లు కొడుతుంది. కనీసం ఈ న్యూస్ కైనా స్పందించవయ్యా జక్కన్న.