ఏదైనా సంచలనంగా నిలిస్తే చాలు దాన్ని తెరకెక్కించేందుకు క్యూలు కట్టేస్తారు మన దర్శకులు. ఇక వివాదస్పద వ్యక్తులకు సంబంధించిన అంశాలైతే మరీను. ఈ మధ్యే సీరియల్ చార్లెస్ శోభ్ రాజ్ జీవిత కథ ఆధారంగా మై ఔర్ చార్లెస్ అంటూ బాలీవుడ్ లో ఓ చిత్రం తెరకెక్కింది. ఇక ఇప్పుడ తాజాగా జనాల నోళ్లలో నానుతున్న మాఫియా డాన్ చోటా రాజన్ జీవిత కథను చిత్రంగా తెరకెక్కేంచేందుకు బాలీవుడ్ లో సన్నాహాలు చేస్తున్నారట.
ఇక ఇందులో చోటా రాజన్ పాత్రను చేసేది ఎవరో తెలిస్తే మీరు షాక్ తినక మానరు. బాలీవుడ్ మెగాస్టార్ తనయుడు అభిషేక్ బచ్చన్ ఇందులో లీడ్ రోల్ పోషించనున్నాడని సమాచారం. ప్రముఖ రచయిత ఎన్ హుస్సేన్ జైదీ రాసిన 'బైకుల్లా టు బ్యాంకాక్' అనే పుస్తకం ఆధారంగా దీనిని రూపొందించనున్నారట. సంజయ్ గుప్తా దీనికి దర్శకత్వం వహించనున్నాడని టాక్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు చెబుతున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
రాజేంద్ర నిఖల్జే పొట్టివాడు కావటంతో అంతా చోటా రాజన్ అని పిలిచేవారు. మరి అలాంటి వ్యక్తి పాత్రకు అభిషేక్ లాంటి పొడుగు వ్యక్తిని ఎంచుకోవటం అసలు సూటవ్వుద్దా అన్నదే ఇప్పుడు ప్రశ్న.