నాకెవరూ పోటీ లేరు. నేనేవరికి పోటీ కాదు. నాకు నేనే పోటీ. నాతో నాకే పోటీ! గబ్బర్ సింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి పేలిన డైలాగు ఇది. మరి దానికి సీక్వెల్ వస్తుందంటే ఇంకెంత అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం 'సర్దార్-గబ్బర్ సింగ్' షూటింగ్ త్వరగతిన జరుపుకుంటుంది. అయితే రిలీజ్ డేట్ లోనే చిన్న మార్పు చేసుకుంటుందట.
ముందుగా సినిమాను ఏప్రిల్ లో విడుదల చేద్దామనుకున్నారు. అయితే ఆ టైంలోనే మహేష్ బ్రహోత్సవం, అల్లు అర్జున్ సరైనోడు చిత్రాలను విడుదల చేయాలని చూస్తున్నారట. దీంతో కాస్త పోటీ ఉంటుందనే భావనలో చిత్ర యూనిట్ ఉందని సమాచారం. పోటీ లేకుండా ఉంటేనే అన్ని చిత్రాలకు లాభమని ఈ యేడు రుజువైంది. దీంతో ఇదే తరహా వాతావరణాన్ని వచ్చే సంవత్సరం కూడా కొనసాగించాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో సర్దార్ ను ముందుగానే రిలీజ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అందుకోసం త్వరగతిన షెడ్యూల్ పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ఇక ఈ సినిమాకి సంబంధించిన మేజర్ షెడ్యూల్ ను ఈ నెల 17 నుంచి గుజరాత్ లో ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ నుంచి కాజల్ ఈ సినిమా షూటింగులో పాల్గొననుంది. సో... మార్చిలో పెద్ద సినిమాలేవీ అనౌన్స్ చేయకపోవటంతో సోలో పోటీకే సర్దార్ మొగ్గుచూపుతున్నాడని తెలుస్తోంది.