ఒకప్పటి నటి మాలాశ్రీపై యాసిడ్ దాడి చేస్తామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెన్నయ్ సంబంధించిన ముగ్గురు వ్యక్తులు ఈమెను బెదిరిస్తున్నట్టు ఆ ఫిర్యాదులో పేర్కొంది. మాలాశ్రీ, ఆమె భర్త నిర్మాత రాముకు చెన్నైలో ఒక మాల్, ఫ్లాట్ ఉన్నాయి. వారు బెంగ్లూర్ లో స్థిరపడి అప్పుడప్పుడూ చెన్నైకి వెళ్ళి వస్తుంటారు. అయితే చెన్నైలో ఉన్న ఆస్తులను చూసుకోడానికి ముగ్గురిని నియమించింది. ఆ ముగ్గురికి తన ఆస్తులను అమ్మిపెట్టమని, అమ్మిన తరువాత 2 లక్షలు ఇచ్చేలా మాట్లాడుకుంది. కానీ వాళ్ళు ఆ డబ్బు తీసుకొని కూడా తిరిగి మళ్ళీ రెండు లక్షలు డిమాండ్ చేస్తూ వారిపై ఆసిడ్ దాడి చేస్తామని బెదిరిస్తుండడంతో, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.