బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్ ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం గుడ్ విల్ రాయబారిగా నియమితులయ్యారు. దక్షిణాసియాకు ఆయనను అంబాసిడర్ గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం చరిత్రలో ఒక పురుషుడిని రాయబారిగా నియమించడం ఇదే మొదటిసారి. ఐక్యరాజ్యసమితి ఇటీవల ప్రారంభించిన ‘హి ఫర్ షీ’ అనే కార్యక్రమం కోసం ఇకపై ఫర్హాన్ అక్తర్ పనిచేయనున్నారు. లింగ సమానత, మహిళా సాధికారిత కోసం ఐక్యరాజ్యసమితి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఫర్హాన్ ఇప్పటికే తనంత తానుగా లైంగికదాడులు, లింగ వివక్షకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.