సల్మాన్ పై చర్యలు తీసుకోవాల్సిందే

November 14, 2014 | 02:49 PM | 28 Views
ప్రింట్ కామెంట్

ఓ ఛానెల్ కార్యక్రమంలో ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందేనని హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి డిమాండ్ చేస్తున్నాడు. కలర్స్ ఛానల్ లో ప్రసారమయ్యే బిగ్ బాస్ షోకు సంబంధించి గతేడాది ఒక ప్రకటనలో కుక్కను స్వర్గంలా చిత్రీకరించి ముస్లింల మనోభావాలను సల్మాన్ ఖాన్ దెబ్బతీశాడని మహ్మద్ ఫసీమొద్దీన్ ఆరోపించాడు. ఇదే విషయమై ఏడాది క్రితం ఫలక్‌నుమా, బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌లలో ఫిర్యాదుల చేశామని కానీ, ఇంతవరకు పోలీసులు విచారణగానీ, దర్యాప్తుగానీ చేపట్టలేదని అతడు ఆవేదన వ్యక్తం చేశారు. తన సోదరి పెళ్లి నిమిత్తం హైదరాబాద్ రాబోతున్న సల్మాన్‌ను అదుపులోకి తీసుకొని విచారించాలని ఈ సందర్భంగా వారు పోలీసులను కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో చొరవ చూపి చట్టపరమైన చర్యలకు పోలీసులను ఆదేశించాలని కోరారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ