పరువు నష్టం దావా కేసులో తమిళ నటుడు విజయ్ కాంత్ కు మద్రాస్ కోర్టు జరిమానా విధించింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసినందుకు రూ.24వేలు చెల్లించాల్సిందిగా ఆదేశించింది. అధికార అన్నాడీఎంకే నేతలపై తీవ్ర విమర్శలు చేసినందుకు విజయ్ కాంత్ పై పలు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి వారెంట్లు వస్తుండటంతో విసిగిన విజయ్ కాంత్, ఆయన అనుచరులు విచారణ ఆపాలని హైకోర్టును ఆశ్రయించారు. స్టే తెచ్చుకునేందుకు సుప్రీంకోర్టుకు వెళ్తామని అభ్యర్థించగా, హైకోర్టు అందుకు అంగీకరించింది. అయితే నెల రోజుల సమయం ఇచ్చినప్పటికీ స్టే తేవటంతో విఫలమవ్వటంతో కోర్టు జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది.