ముందు చెల్లిగా... ఆ తరువాతే చెలిగా

February 16, 2015 | 04:46 PM | 96 Views
ప్రింట్ కామెంట్
allu_arjun_nithya_menon_movie_niharonline

సెలక్టివ్ సినిమాలు చేస్తుందన్న పేరు నిత్యామీనన్ కి నాటుకుపోయింది. నిత్య సినిమా ఒప్పుకుందంటే అందులో సమ్ థింగ్ స్పెషల్ ఉంటేనే అనే ముద్రపడిపోయింది. తాజాగా ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో నిత్యా మీనన్ నటిస్తుంది. అయితే ఈ చిత్రంలో బన్నీ సరసన హీరోయిన్ గా కాకుండా చెల్లెలి పాత్రలో నటిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ విషయం గురించి నిత్యను అడిగితే అవుననే షాక్ ఇచ్చింది. అంతేకాదు గతంలో షారుక్, ఐశ్వర్యాలు కూడా ‘జోష్’ సినిమాలో అన్నాచెల్లెలుగా నటించారు. ఆ తర్వాత ‘దేవదాసు’లో జంటగా నటించారు. ఇలాంటివన్నీ కూడా సినిమాల్లో కామన్ అంటూ చెబుతోంది. అయితే చివర్లో ఓ ఇంట్రస్టింగ్ సీక్రెట్ ని కూడా చెప్పేసిందండోయ్. బన్నీ తన తదుపరి సినిమాలో హీరోయిన్ గా తనకు అవకాశం ఇస్తానని ప్రామిస్ చేసాడట. అందుకే ఇలా ఒప్పుకున్నా అంటూ మోహమాటం లేకుండా చెప్పేసిందీ రింగు జుత్తుల చిన్నది. వరుస ఆఫర్లు వస్తున్న సమయంలో ఏ హీరోయిన్ కూడా స్టార్ హీరోకు సిస్టర్ పాత్రలో నటించడానికి అస్సలు అంగీకరించదు. కానీ సినీ ఇండస్ట్రీలో ఇలాంటివి ఆలోచించవద్దని, నటిగా మంచి పాత్రలు ఏం వచ్చినా చేయాలని చెబుతోంది నిత్యామీనన్. మరీ నిత్య చేసే ఈ డేర్ ఫీట్ తన సినీ భవిష్యత్ ను దెబ్బతీయదు కదా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ