ఇక్కడో నటి ఓవర్ యాక్షన్ చేసి సౌత్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. తన విపరీత చర్యతో ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుందా తమిళ హీరోయిన్. మీనాక్షి అలియాస్ పింకీ సర్కార్ అనే నటి ప్రస్తుతం నేర్ ముగమ్ అనే చిత్రంలో నటిస్తోంది. అయితే ఓ పక్క షూటింగ్ జరుగుతున్న సమయంలో సడన్ గా సెట్లోకి వచ్చి అక్కడున్న అస్టిస్టెంట్ డైరక్టర్ శంకర్ గూబ వాయించిందట. ఇంతకీ, ఆ కుర్రాడు చేసిన తప్పేంటని ఆరా తీస్తే ఆమె చెప్పిన విషయాన్ని విని అక్కడున్న వారంతా షాక్ కి గురయ్యారట.
సదరు అసిస్టెంట్ దర్శకుడు ఆమె కారవాన్ లోకి వెళ్లి మంచినీళ్లు తాగడమేనంట! దీంతో ఈ మాత్రం దానికే అతన్ని కొడుతుందా? అంటూ ఆ సినిమా యూనిట్ సభ్యులు ఆమెపై విరుచుకుపడుతున్నారు. దీంతో మ్యాటర్ ముదరక ముందే మీనాక్షి తన చర్యకు విచారాన్ని వ్యక్తం చేసిందట. సెట్లో ఇకపై ఇలాంటి చర్యలకు దిగనని లిఖిత పూర్వక హామీ ఇచ్చాకనే ఆమెను షూటింగ్ కు అనుమతించారట. ప్రస్తుతానికైతే విషయం పెద్దది కాకుండా చూసుకున్నారు. మరి, ఇది ఇక్కడితో ఆగుతుందా? లేక ఇంకా సీరియస్ అవుతుందా? అన్నది చూడాలి! కాగా, ఆమె విజయ్ తుపాకీలో ఓ చిన్న క్యారెక్టర్ తోపాటు, నయనతార తాజా హిట్ చిత్రం నానుమ్ రౌడీలో ఓ కీలక పాత్ర పోషించింది.