స్నేహ తల్లికాబోతోంది

April 14, 2015 | 01:08 PM | 159 Views
ప్రింట్ కామెంట్
actress_sneha_to_become_mother_niharonline

తెలుగింటి ఆడపడుచు స్నేహ త్వరలో తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని స్నేహ , ప్రసన్న దంపతులు వెల్లడించారు. మంగళవారం తమిళ ఉగాది. ప్రసన్న మాతృభాష తమిళం. స్నేహ కుటుంబం కూడా చాన్నాళ్లుగా తమిళనాడులోనే ఉంటోంది. కోలీవుడ్ లో అందమైన పేరు తెచ్చుకున్న స్నేహ, ప్రసన్న వివాహం ప్రేమ వివాహమే. ఇరు వర్గాల పెద్దల అంగీకారంతో తెలుగు సంప్రదాయం, తమిళ బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం వీరు పెళ్లి చేసుకున్నారు. తాజాగా స్నేహ గర్భంతో ఉంది.  ఆమె నటించిన సన్నాఫ్ సత్యమూర్తి ఇటీవల విడుదలైంది. స్నేహలో కొత్త మెరుపు కనిపిస్తోందని చూసిన వాళ్లందరూ అన్నారు. అంటే సంగతి ఇదన్నమాట. పండగపూట మా ఇంటికి కొత్త సభ్యుడు రాబోతున్నారని చెప్పడానికి ఆనందిస్తున్నామని ఈ దంపతులు చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ