మెగాస్టార్ చిరంజీవి మళ్లీ వెండితెరపై తన 150వ సినిమాతో రంగప్రవేశం చేస్తాడని మెగా అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి విదితమే. చాలా కాలంగా చిరంజీవికి తగిన మంచి కథకోసం చర్చలు జరుగుతూనే ఉన్నాయి. దర్శకుడు ఎవరనేది కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం మేర చిరంజీవి 150వ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్టర్ వహించనున్నాడని, ఆ సినిమా బి.వి.ఎస్.రవి కథను అందించనున్నాడని వార్తలు వినపడుతున్నాయి.