తమిళ దర్శకుడు బాలా చిత్రాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. శివపుత్రుడు, నేనే దేవుడ్ని, పరదేశీ, వాడు-వీడు... ఇలా వైవిధ్య భరితమైన సబ్జెక్టులతో చిత్రాలు వచ్చాయి. టైటిళ్లకు తగ్గట్టే వాటిలో హింసపాళ్లు అలానే ఉంటుంది. అందుకే ఆయన చిత్రాలన్నింటికీ సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ ను ముందుగానే నిర్ణయిస్తాయి. అయితే అనుహ్యాంగా ఇప్పుడు సెన్సార్ బోర్డు బాలా చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చాయి. ఆశ్చర్యపోకండి అది బాలా దర్శకత్వం వహించిన చిత్రం కాదులేండి. కేవలం నిర్మాత మాత్రమే. నటుడు మురళి తనయుడు అధర్వ హీరోగా చండీ వీరన్ అనే ఓ చిత్రం రూపుదిద్దుకుంది. దీనికి శర్కుణమ్ దర్శకత్వం వహించగా, బాలా నిర్మాతగా వ్యవహారిస్తున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రోమాంటిక్ యాక్షన్ సబ్జెక్ట్ తో ఈ చిత్రం తెరకెక్కిందట. ఇటీవలె దీనికి సెన్సార్ పూర్తయ్యింది. చిత్రాన్ని చూసిన బోర్డు సభ్యులు అధర్వ నటనకు ప్రశంసలు కురిపించడంతోపాటు చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చారట. ఇందులో అధర్వకు జోడిగా బస్ స్టాప్ ఫేం రక్షిత (ఆనంది) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం ఆగష్టు 7న అంటే రేపు విడుదలవుతుంది.