నాని, లావణ్య త్రిపాఠి నటిస్తున్న మారుతీ దర్శకత్వంలో వస్తున్న భలే భలే మగాడివోయ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. బన్నివాసు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాల్లో బిజిగా వుంది. అగష్టు 15న ఈ చిత్రం ఆడియోను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. అల్లు అరవింద్ సమర్పణలో, ఎడివిజన్ ఆఫ్ గీత ఆర్ట్స్ బ్యానర్ పై యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ప్రోడక్షన్ నెం. 1 గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ: ” భలే భలే మగాడివోయ్ షూటింగ్ పూర్తయింది. నటించటానికి వీలున్న మంచి పాత్ర చేశానన్న తృప్తివుంది. మారుతితో పనిచేయటం చలా హ్యపీగా వుంది. తక్కువ టైంలో ఈ చిత్రం పూర్తయింది. లావణ్య త్రిపాఠి మంచి కోస్టార్. ఎక్కడా ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా షూటింగ్ అంతా అయిపోయంది. తప్పకుండా ఫ్యామిలి అంతా ధియోటర్స్ కి వెళ్ళి చూడాల్సిన చిత్రం ” అన్నారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ ‘‘మా చిత్రం భలే భలే మగాడివోయ్ ఇప్పడు ఆడియో వేడుకకి సిధ్ధమవుతుంది. నేషనల్ అవార్డు విన్నర్ గోపిసుందర్ అందించిన ఆడియోని స్వాతంత్రదినోత్సవం సంధర్బంగా అగష్టు 15న విడుదల చేస్తున్నాము. ప్రమోషన్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకుని డిఫరెంట్ గా సినిమాని ప్రెజెంట్ చేస్తున్నాము. ఇటీవల గోవాలో తీసిన సాంగ్ మరియు టైటిల్ సాంగ్ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి. శేఖర్ మాస్టర్ వేయించిన స్టెప్స్ విజిల్స్ కొట్టించేలా వుంటాయి. నిజార్ కెమెరా వర్క్ సూపర్బ్ గా వుంటుంది. నేను ఏ కథ తీసుకున్నా కూడా ఎంటర్టైన్మెంట్ తో చేస్తాను. ఈ చిత్రం మరింత ఎంటర్టైన్మెంట్ తో చేశాను. కథలోనూ కామెడి, కేరక్టర్స్ లోనూ కామెడి వుండటంతో చిత్రం ఆద్యంతం నవ్వుతూనే వుంటారు‘‘ అన్నారు నిర్మాత బన్నివాసు మాట్లాడుతూ “ఏక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. మారుతి అనుకున్నది అనుకున్నట్టే తీసాడు. షూటింగ్ టైం లోనే యూనిట్ అంతా ఎంజాయ్ చేస్తూ చేశారు. కోత్తజోనర్ లో చిత్రాన్ని తెరకెక్కించాడు. నాని చాలా బాగా నటించారు. ఆయన కేరక్టర్ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. ఈ చిత్రం పూర్తిగా కమర్షియల్ వాల్యూస్ విత్ ఎంటర్టైన్మెంట్ తో చిత్రీకరించాం.” అన్నారు.