గోపాల గోపాల సినిమా విడుదలకు ముందునుంచే అభిమానుల ఆసక్తి ఎక్కువగానే కనిపిస్తోంది. ఈ రోజులు విడుదలైన ప్రతి థియేటర్ లోనూ సందడి, హడావుడి బాగా ఎక్కువగానే ఉంది. మరో నాలుగు రోజుల వరకు దాదాపు అన్ని థియేటర్లలో టిక్కెట్స్ అడ్వాన్స్ బుకింగ్ అయిపోయాయి. సినిమా పూర్తి వినోదాత్మకంగా ఉందని, అదే సమయంలో సందేశాత్మకంగా ఉందని సినిమా చూసిన వారు కొందరు చెబుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, వెంకటేష్ మధ్య సాగే సన్నివేశాలు బావున్నాయని ఆడియన్స్ టాక్. ఫస్ట్ డే రెస్పాన్స్ వల్ల నిర్మాతల్లో ఉత్సాహం పెరిగిపోయింది. సంక్రాంతి వరకు తమకు కలెక్షన్ల పంట పండుతుందని అనుకుంటున్నారు. అయితే కొందరు సినీ అభిమానులు మాత్రం ‘ఓ మై గాడ్’ చూసిన వారికి ఈ చిత్రం పెద్దగా నచ్చకపోవచ్చునని భావిస్తున్నారు. పవన్ కళ్యాన్ ను డిఫరెంట్ స్టయిల్ చూడాలనుకునేవారికీ, కామెడీ ఇష్టపడే వారికి మాత్రం ఈ సినిమా ఓకే అని అనుకుంటున్నారు.