గోపాలుడు కూడా మనోభావాలు దెబ్బతీశాడంట

January 10, 2015 | 04:10 PM | 47 Views
ప్రింట్ కామెంట్

టాలీవుడ్ మల్టీస్టారర్ చిత్రం గోపాల గోపాల పై హైదరాబాద్ లోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు అందింది. హిందువుల మనోభావాలను కించపరిచేలా సదరు చిత్రం ఉందంటూ రఘునాథరావు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేవారు. ఈ చిత్రంపై ఇదివరకే విశ్వ హిందూ పరిషత్ ఆందోళన చేపట్టింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ చిత్రానికి సర్టిఫికెట్ మంజూరు చేయరాదంటూ వారు సెన్సార్ బోర్డు కార్యాలయం ముందు ధర్నాకు కూడా దిగారు కూడా. కాగా ఈ చిత్రం శనివారం ఉదయమే విడుదలైంది. విడుదలైన కొద్ది గంటల్లోనే సదరు చిత్రంపై ఫిర్యాదు అందటం గమనార్హం.అయితే చిత్రంలో మత భావాలు దెబ్బతీసేలా ఏం లేదని, కేవలం మతాధిపతుల పేరిట మోసాలు చేసేవాళ్లపై ఈ చిత్రం విసుర్లు విసిరిందని టాక్. అమీర్ ఖాన్ పీకే చిత్రంపై సరిగ్గా ఇదే అంశంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం మరి రూ.600 కోట్ల కలెక్షన్లను దాటి వేసింది. మరిప్పుడు గోపాలుడు కూడా కాంట్రవర్సరీతో లాభాలు గడిస్తుందా?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ