పూరీ కొత్త పోరి ఎవరంటే...

April 20, 2016 | 05:39 PM | 3 Views
ప్రింట్ కామెంట్
Aditi-Arya-kalyanram-puri-movie-niharonline

పూరీ సినిమాలు అంటే చాలు హీరోయిజం ఒక్క డైలాగుతో ఎలా ఎలివేట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే టైంలో పూరీ సినిమాలో హీరోయిన్లకు కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే వారసలు తెలుగువారే ఉండరు. ఎప్పటికప్పుడు ప్రెష్ పేస్ ను ఎంపిక చేసి ఆశ్చర్యానికి గురి చేస్తుంటాడు పూరీ. అలాంటి పూరీ త్వరలో కళ్యాణ్ రామ్ తో సినిమా చేయడానికి రెడీ అయిపోతున్నాడు. ఇక ఈ చిత్రం కథానాయిక పాత్ర కోసం చాలా మందిని పరిశీలించి చివరికి ఓ కొత్త అమ్మాయిని ఎంపిక చేశారంట.

                                ఢిల్లీకి చెందిన మోడల్ అతిధి ఆర్య, మిస్ ఇండియా 2015 విన్నర్ గా నిలిచిందట. సినిమాకి కొత్త గ్లామర్ ను తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఆమెను పూరీ ఓకే చేశాడని అంటున్నారు. ఇటీవల ఈ అమ్మాయికి సంబంధించిన ఫోటో షూట్ ను కూడా నిర్వహించారని చెబుతున్నారు. కల్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ పైనే ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ