తమన్నా ఏం మాయ చేసిందో!

April 20, 2016 | 02:58 PM | 1 Views
ప్రింట్ కామెంట్
ajith-kumar-tamanna-bhatia-second-film-niharonline

సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న మిల్కీబ్యూటీ తమన్నా తెలుగుతోపాటు తమిళ్, మరోవైపు బాలీవుడ్ లోనూ తన సత్తా చాటేందుకు రెడీ అయిపోతుంది. కానీ, బాలీవుడ్ లో ఈ అమ్మడికి అదృష్టం కలిసి రావటం లేదు. అయినా సౌత్ లో మాత్రం టాప్ రేసులో కొనసాగుతుంది. ఇక ఇప్పుడు సౌత్ స్టార్,  తల అజిత్ సరసన రెండోసారి నటించే ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది. గతంలో అజిత్ తో వీరమ్, వేదాళంలతో హిట్ కొట్టిన శివ దర్శకత్వంలోనే ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.

                 తొలుత అనుష్కకి గానీ .. త్రిషకి గాని కథానాయిక ఛాన్స్ లభించే అవకాశం ఉందనే టాక్ వినిపించింది. అయితే అందులో అవకాశం తనదేనని, అజిత్ తో రెండోసారి జతకట్టి తీరతానని తమ్మూ గతంలో ప్రకటించింది. అప్పుడు అంతా తమన్నాది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నారు. కానీ,  చివరికి తమన్నాకే ఈ అవకాశం లభించిందనేది కోలీవుడ్ సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్ ను మే నెల చివరి నుంచి గానీ .. జూన్ మొదటివారంలో గాని ఆరంభిస్తారట. గతంలో వీరమ్ లో కూడా తమన్నాయే హీరోయిన్ కావటం, అది బ్లాక్ బస్టర్ కావటంతో అజిత్ ఫ్యాన్స్ 57వ చిత్రం కూడా హిట్ అయితీరుతుందనే నమ్మకంలో ఉన్నారంట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ