ఓకే బంగారం హిట్ తో తిరిగి ఫాంలోకి వచ్చిన టాప్ దర్శకుడు మణిరత్నం ఓ భారీ మల్టీ స్టారర్ తెరకెక్కించాలని ప్రయత్నించి ఫేలయ్యాడు. అయితే అది కొంచెం టైం పడుతుందని, ఆలోపు మరో కథతో ముందుకు వస్తానని ప్రకటించాడు. కార్తీ కథానాయకుడిగా రూపొందనున్న ఈ సినిమాకి కథానాయికగా ముందుగా ప్రేమమ్ ఫేం సాయిపల్లవిని అనుకున్నారు. అయితే పాత్రకి తగిన వయసు సాయిపల్లవికి లేదని భావించిన ఆయన ఇప్పుడు మరో హీరోయిన్ ను ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటి అదితి రావును తీసుకున్నారంట.
హైదరాబాద్ కి చెందిన అదితి రావు అడపాదడపా పలు హిందీ సినిమాల్లో నటించడమేగాక, బికినీ షూట్ లలో అందాలు ఆరబోసింది. కాస్త గ్లామర్ ఒలకబోయాల్సిన ఈ చిత్రంలో అదితి రావు అయితే పాత్రకి సరిగ్గా సరిపోతుందని భావించిన మణిరత్నం, ఆమెను ఫైనల్ చేశాడని అంటున్నారు. మణిరత్నం సొంత బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాకి, ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సెప్టెంబర్ లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు.