సినిమా షూటింగ్ అయిపోగొట్టగానే ఓ హీరో బాధ్యత అయిపోయినట్లు కాదు. దాని బిజినెస్ కి తగ్గట్లుగా అంచనాలు పెంచేసి మార్కెట్లో పబ్లిసిటీ చేయటం కూడా అతని వంతే. ముఖ్యంగా బాలీవుడ్ లో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. ప్రమోషన్ లో భాగంగా నానా సర్కస్ ఫీట్లు చేయటం బాద్ షా షారూఖ్ ఖాన్ లాంటి వాళ్లకే తప్పలేదు. అయితే తీరా ఫలితం చూశాక మాత్రం ఇంతమాత్రానికేనా అని పెదవి విరుస్తాడు సగటు ప్రేక్షకుడు. తాజాగా సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ హీరోగా తెరకెక్కుతున్న ‘అజార్’ చిత్ర విషయంలో కూడా ఇలాంటివి బాగానే జరుగుతున్నాయి.
మాజీ కెప్టెన్ అజారుద్దీన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ లీడ్ పాత్ర పోషిస్తుంటే, అతని రెండో భార్య సంగీత బిజీలాని పాత్రలో పాక్ సుందరి నర్గీస్ ఫక్రీ నటిస్తోంది. చిత్రంలో ఓ పాటలో ఇద్దరి మధ్య రొమాన్స్ బాగా కుదిరిందట. అయితే ఇమ్రాన్ తో లిప్ లాక్ ఇష్టంలేని నర్గీస్ షూటింగ్ నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయిందని టాక్ వినిపించింది. దీంతో నర్గీస్ మొత్తం చిత్రం నుంచే తప్పుకుందన్న గాసిప్స్ రేగాయి. అయితే ఏమయిందో ఏమో తెలీదుగానీ తాజాగా మరో ఫోటో అదంతా ఉత్తదేనని తేల్చింది. షూటింగ్ సెట్లో నర్గీస్ కాళ్లకు మసాజ్ చేస్తున్న ఫోటోను ఇమ్రాన్ పోస్ట్ చేశాడు. ఇది చూశాక నర్గీస్ అలిగి వెళ్లిపోవటం ఇదంతా కథలో భాగమేనని, కేవలం ప్రమోషన్ కోసం హీరో ఇమ్రాన్ హష్మీ అంతా క్రియేట్ చేశాడని క్లియర్ గా అర్థమయ్యింది.