సన్నీలియోన్ పేరు చెబితే కుర్రకారులో ముచ్చెమటలు పోయటం ఖాయం. సినిమాల్లోకి రాకముందు ఆమె ఏం చేసేదో ఇండియాకు వచ్చాక జనాలకు తెలిసింది. ఇక ఆపై ఈ పోర్న్ స్టార్ టర్న్ బాలీవుడ్ యాక్టర్ పాపులారిటీ అంతకంతకు పెరిగి ఇప్పుడు ఎవరికీ అందనంత స్టేజ్ కీ వెళ్లిపోయింది. అదే టైంలో ఆమెను వాడుకుని టీఆర్పీలు పెంచుకున్న చానెలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కలర్స్ చానెల్ లో వచ్చే బిగ్ బాస్ షో తో సన్నీ లైఫ్ టర్న్ అయిపోయింది. బాలీవుడ్ లో ఏలేందుకు బీజం వేసింది. ఇప్పుడా వరుసలో మరో పోర్న్ స్టార్ కూడా రాబోతుందని రెండు మూడు రోజులుగా వార్తలు వస్తున్నాయి.
అడల్ట్ స్టార్ మియా ఖలీఫా బిగ్ బాస్ 9వ సీజన్లో నటించనుందని వార్తలొచ్చాయి. బురఖా ధరించి పోర్న్ వీడియోలో కనిపించి ఆమె బాగా పాపులర్ అయ్యింది లేండి. ఆ వీడియోల ద్వారానే ఆమె ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యింది. మియా లెబనీస్-అమెరికన్ మోడల్ నటిగా మియా ఖలీఫాకు మంచి గుర్తింపు ఉంది. సన్నిలియోన్కు చెల్లిగా ఆమెకు పేరుకూడా ఉంది. మియా ఖలీఫా ఇటీవల తన సొంత దేశమైన లెబనాన్ జాతీయ గీతంలోని తొలి వాఖ్యాన్ని తన చేతిమీద టాటూగా వేయించుకుని వివాదంలో నిలిచింది. బురఖా ధరించి సెక్స్ వీడియోలో కనిపించడంతో ఇస్లామిక్ మిలిటెంట్లు ఆమెను చంపేస్తామని హెచ్చరికలు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఇక ఈ సీజన్ షోకి మరింత వన్నె తెచ్చేందుకు ఈ పొర్న్ స్టార్ తో చేయిద్దామనకున్న నిర్వహకులకు ఆమె పెద్ద షాకే ఇచ్చింది. సూపర్ క్రేజ్ ఉన్న 22 ఏళ్ల అడల్ట్ సెలబ్రిటీ ని వాడుకోవాలన్న నిర్ణయానికి ఆమె నో చెప్పింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇకపై భారత్లో అడుగుపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది. బురఖాలో బూతు సినిమాల్లో నటించేందుకు లేని సిగ్గు ఇప్పుడు భారత్ కు రావటానికి ఎందుకమ్మా అని సోషల్ మీడియాలో చమక్కులు పేలుస్తున్నారు.