ఎయిడ్స్ కోసం శృతి కృషి...!

December 17, 2014 | 03:43 PM | 29 Views
ప్రింట్ కామెంట్

సినిమా తారలు సమాజ సేవకు పూనుకోవడం ఇటీవల కాలంలో చాలా మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. శృతి కూడా తానేమీ తక్కువ కానంటూ తన వంతుగా ఎయిడ్స్ నిర్మూలనకు కృషి చేస్తానంటోంది. అంతకు ముందే సమంత, అనుష్క, హన్సిక, కాజల్ వంటి పెద్ద కథానాయికలు తమ రెమ్యునరేషన్ లో కొంత భాగం సమాజ సేవకు అంకితం చేస్తున్నారు. ప్రతి ఏటా అంథ విద్యార్థుల చదువుకోసం సహాయమందిస్తోంది సమంత. మూగజీవాల సంరక్షణ ప్రచారం, ఆర్థికంగా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో అనుష్క పాటుపడుతోంది. ప్రతి యేటా తన పుట్టిన రోజు నాడు కొందరు అనాధ పిల్లల్ని దత్తత తీసుకుని వారి పోషణ భరిస్తోంది హన్సిక, కాజల్ కూడా మహిళా స్వచ్ఛంద సంస్థల కోసం పాటు పడుతోంది. చదువుకునే అమ్మాయిలకు, ఆర్థిక అవసరాలు కలిగిన స్త్రీలకు సహాయ మందిస్తోంది. ఈ హీరోయిన్ల బాటలోనే ఇప్పుడు శృతి కూడా సమాజ సేవకు నడుం బిగించింది. ప్రతి యేటా ప్రాణంతకమైన ఎయిడ్స్ వ్యాధి బారిన పడి లక్షలమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికీ ఈ వ్యాధిపై సరైన అవగాహన లేక పోవడంతో మరింత ప్రాణ నష్టం జరుగుతోంది. అందుకే దీనిపై ఓ వాణిజ్య ప్రకటనలో నటించి మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి అవేర్ నెస్ కల్పించడానికి పూనుకుంది శృతి. ఈ వీడియోని అంతర్జాలంలో ప్రచారం చేయడం ద్వారా చాలా మందికి ఉపయోగపడుతుందని ఎయిడ్స్ నిరోధక సంస్థలు భావిస్తున్నాయి. ప్రస్థుతం సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నప్పటికీ ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి మంచి కార్యక్రమానికి స్వచ్ఛందంగా తన సమ్మతిని తెలిపిందట శృతి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ