కేన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆదివారం ఐశ్వర్య రెడ్ కార్పెట్ పై తళుక్కుమంది. ఆమె ఎమరాల్డ్ రంగ్ లాంగ్ లేస్ గౌను ధరించి అక్కడికి విచ్చేసిన అందరి చూపుల్ని ఆకట్టుకుంది. ఒక బిడ్డకు తల్లి, నలభై ఏళ్ళ వయసులోనూ టీనేజ్ అమ్మాయిలా మెరిసిపోతోంది. 68వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి బాలీవుడ్ నుంచి వెళ్ళిన తారల్లో విశ్వసుందరి ఐశ్వర్య కూడా ఉంది. ఆరాద్య పుట్టిన తరువాత దాదాపు రెండేళ్ళ గ్యాప్ అనంతరం సినిమాల్లో నటిస్తున్న ఐశ్వర్య తిరిగి తన వెనుకటి లావాణ్యాన్ని సంతరించుకుంది. స్లీవ్ లెస్ నెట్ డ్రెస్ ధరించి, కురులను గాలికి వదిలి ఆమె కేట్ వాక్ చేస్తుంటే కెమెరాలన్నీ క్లిక్ మంటూ పోటీ పడ్డాయి. తన మూడేళ్ల కూతురు ఆరాధ్యతో కలిసి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరయ్యింది.