తెలుగు చిత్ర పరిశ్రమ చీపురుపట్టింది. భాగ్యనగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్న సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన స్వచ్ఛ హైదరాబాద్ కు తమవంతు మద్దతుగా పలువురు సినీ ప్రముఖులు ఆదివారం ఉదయం రోడ్లపై చీపుర్లు పట్టి చెత్తను ఊడ్చారు. ఫిల్మ్ నగర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో నటులు వెంకటేష్, రాజేంద్రప్రసాద్, రాజశేఖర్, జీవిత, వేణు మాధవ్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత దగ్గుపాటి సురేష్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి తలసాని యాదవ్ పాల్గొన్నారు. ఇక ప్రతిజ్నలో తామంతా క్లీన్ సిటీకి కట్టుబడి ఉన్నామని వారంతా తెలిపారు.