మొబైల్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా అఖిల్

August 25, 2015 | 02:19 PM | 1 Views
ప్రింట్ కామెంట్
akhil_akkineni_moble_brand_ambassador_niharonline

అక్కినేని అఖిల్ కు అభిమానులు బహుశా సిసింద్రీ సినిమా నుంచే మొదలయ్యారేమో (!). సినిమా వారసులు ఎక్కువవుతుండడంతో ఇప్పుడు అభిమానులు కూడా కుటుంబం మొత్తాన్ని అభిమానిస్తున్నారు. మరి ఒక్క సినిమా అయినా రాకుండా అఖిల్ కి ఇంత  మంది అభిమానులు ఎక్కడినుంచి వచ్చారు అంటే... అక్కినేని నాగేశ్వర్ రావు, ఆ తరువాత నాగార్జున, ఇప్పుడు అఖిల్, నాగచైతన్య. సినిమాలు, అభిమానుల సంగతి పక్కన పెడితే ఈ స్టార్ డమ్ ను వాణిజ్య ప్రకటనలకు కూడా బాగా ఉపయోగపడుతోంది.  అఖిల్ తన మొదటి సినిమా రిలీజ్ కాకముందే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్నాడు. ఇప్పటికే అఖిల్ టైటాన్, మౌంటైన్ డ్యూ లాంటి బ్రాండ్స్ కి అంబాసిడర్ గా ఉన్నాడు. తాజాగా అఖిల్ మరో బ్రాండ్ కి అంబాసిడర్ గా సైన్ చేసాడు. అదే నేషనల్ వైడ్ గా ఫేమస్ అవుతున్న కార్బన్ మొబైల్స్ కి అంబాసిడర్ అయిపోయాడు. ఈ మధ్యే ఈ ప్రకటనకు సంబంధించిన షూటింగ్ ముగించాడట. త్వరలో ఈ మొబైల్స్ యాడ్ ప్రేక్షకులకు దర్శనమివ్వబోతోంది. అఖిల్ యాడ్స్ సెలక్షన్ లోనూ, మూవీ సెలక్షన్ లోనూ మంచి సలహాలివ్వడానికి అనుభవజ్నులైన అమ్మానాన్న సలహాలు ఉంటాయి కాబట్టే సినిమాలూ, యాడ్స్ ఆచీ తూచీ ఎంపిక చేసుకుంటున్నాడు. అఖిల్ మొదటి సినిమా షూటింగ్ పూర్తి చేసుకునే దశకు చేరుకుంది. మొదట ఈ సినిమాను అక్టోబర్ లో విడుదల చేయాలనుకున్నప్పటికీ, సెంటిమెంట్ ప్లస్ దసరా కు విడుదల చేసే సినిమాల ప్రభావం తమ సినిమా మీద పడకూడదని డిసెంబర్ కు పోస్ట్ పోన్ చేసుకునే ఆలోచనలో ఉన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ