వాయిదా ఇష్టం లేకపోయినా నితిన్ అఖిల్ సినిమాను వాయిదా వేయక తప్పలేదు పాపం. అదే విషయాన్ని ట్విట్ చేశాడు ‘‘గ్రాఫిక్ పనులు కొన్ని కాకపోవడం వల్ల అఖిల్ సినిమాను దసరాకు విడుదల చేయలేకపోతున్నాం. ఎప్పుడు రిలీజ్ చేసేది మళ్ళీ తెలియజేస్తాం’’ అని ట్వీట్ చేశాడు. అఖిల్ సినిమా విషయంలో నాగార్జున ఎంతో ఇన్ వాల్వ్ అయి పోతున్నాడు. ఔట్ పుట్ చూసిన నాగార్జునకు కొంత అసంతృప్తి అనిపించింది, గ్రాఫిక్స్ మళ్ళీ చేయాలని చెప్పాడట. నితిన్ కు వాయిదా వేయడం ఇష్టం లేకపోయింది. అవతల డిస్ట్రి బ్యూటర్ వాయిదా వేస్తే 70 పర్సెంట్ మాత్రమే ఇస్తామని చెప్పారట. ఈ డైలామాలో కొట్టుమిట్టాడుతున్న నితిన్ చివరికి నాగార్జున మాట వినక తప్పలేదు పాపం. దర్శకుడు వీవీ వినాయక్, నిర్మాత నితిన్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించడమే కాకుండా, సినిమాకు ఈ స్థాయి క్రేజ్‌ను తీసుకురావడంలో కూడా బాగా సఫలమయ్యారు. కాగా అన్ని కుదిరి సినిమా దసరాకు పెద్ద ఎత్తున విడుదలవుతుందనుకుంటున్న తరుణంలో ఇలా అకస్మాత్తుగా వాయిదా పడడం అభిమానులను నిరుత్సాహపరుస్తోంది. ఇక దసరా పండుగ రోజున భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైన అఖిల్ చివరి నిమిషంలో వాయిదా పడడంతో ప్రస్తుతం దసరాకు ఏ సినిమా వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.