నాగ్ పాటకు అఖిల్ స్టెప్పులు

November 22, 2014 | 01:13 PM | 42 Views
ప్రింట్ కామెంట్

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన సినిమాలో తండ్రి మెగాస్టార్ హిట్ పాటలను రీమిక్స్ చేస్తూ హిట్ల మీద హిట్లు కొడుతుంటే ఇప్పుడు మరో యంగ్ హీరో అదే రూటును ఫాలో అయిపోతున్నాడు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున రెండో తనయుడు అఖిల్ ఆరంగేట్రం చేయబోతున్నాడన్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో నాగ్ హాలో బ్రదర్ సినిమాలోని ‘కన్నెపెట్టరో కన్నుకోట్టరో’ సాంగ్ ని రీమిక్స్ చేయబోతున్నారని తెలుస్తోంది. మ్యూజిక్ డైరక్టర్ థమన్ ఈ రీమిక్స్ కు సంబంధించిన పనులను అల్రెడీ ప్రారంభించాడట. ఇక ఈ పాట కోసం చిత్రయూనిట్ తోపాటు అక్కినేని అభిమానులు కూడా ఆత్రుతతో ఎదురుచూస్తున్నారట. నాగ్ పాటల్లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ పాటకు అఖిల్ ఏ రేంజ్ లో స్టెప్పులతో అలరిస్తాడో వేచిచూడాలి. ‘ఢమరుకం’ ఫేమ్ వెలిగొండ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్ర్కిప్టు సమకూరుస్తున్నాడని సమాచారం. ఈ చిత్రానికి మాటల ద్వయం కొనవెంకట్-గోపీమోహన్ డైలాగులు రాస్తున్నారు. డిసెంబర్ లో ఈ చిత్రం సెట్ మీదకు వెళ్లనుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ