బల్గేరియాలో బాహుబలి చిత్రం షూటింగ్ ముగిసింది. అక్కడి చరిత్రాత్మక ప్రదేశాల్లో, ముఖ్యమైన లొకేషన్స్ లో కొన్ని ఎగ్జైటింగ్ సన్నివేశాలను చిత్రీకరించిన యూనిట్..మళ్ళీ భారత్ వచ్చేందుకు సిద్ధమైంది. బల్గేరియా షెడ్యూల్తో ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ షూటింగ్ ముగిసినట్టేనట..అంటే వచ్చే ఏడాది ఏప్రిల్లో రిలీజ్ కావడానికి హంగులు పూర్తి చేసుకుంటోంది.ఈనెల 24 న యూనిట్ ఇండియాకు వచ్చేస్తోందని సమాచారం..ఇక్కడికి చేరుకున్నాక..కొన్ని ప్యాచ్వర్క్స్, చిన్నపాటి మార్పులు,చేర్పులు చేయడం పై యూనిట్ సభ్యులు నిమగ్నమవుతారని తెలుస్తోంది