తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్ కు తరలి రావలన్న సంకల్పంతో అప్పటి ప్రభుత్వం సహకారంతో నిర్మించినదే అన్న పూర్ణ స్టూడియో. అక్కినేని కుటుంబానికి తల్లివంటిదైన ఈ స్టూడియోకు సంబంధించిన 7.25 భూమిని స్వాధీనం చేసుకుంటున్నట్టు రెండు బ్యాంకులు ఓ తెలుగు డైలీలో ఇచ్చిన అడ్వర్టయిజ్‌మెంట్ ద్వారా తెలుస్తోంది. ఈ స్టూడియోను ఇతరత్రా అభివ్రుద్ధి చేసేందకు తీసుకున్న సుమారు 62 కోట్లను చెల్లించకుండా డీఫాల్టర్ కావడంతో తాము ఈనెల 20న ఈ చర్య తీసుకున్నట్టు ఆంధ్రా బ్యాంకు, ఇండియన్ బ్యాంకులు ఈ ప్రకటనలో పేర్కొన్నాయి. అన్నపూర్ణ స్టూడియోకు, ఆ స్టూడియో ఓనర్లకు గత ఏడాదిలోనే తాము నోటీసులు జారీ చేసి రెండు నెలల్లోగా ఈ రుణాన్ని చెల్లించాలని కోరినప్పటికీ, స్టూడియో ఓనర్లు నాగార్జున, సుప్రియ, వై. సురేంద్రల నుంచి స్పందన లేదని తెలిపారు. ఇంకా అన్నపూర్ణ స్టూడియోస్‌తో బాటు నాగ సుశీల, వెంకటేష్ రొడ్డం, నిమ్మగడ్డ ప్రసాద్‌లను కూడా రుణ గ్రహీతలుగా పేర్కొన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ను కమర్షియల్ స్పేస్‌గా మార్చేందుకు నాగార్జున బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాడనీ, కానీ అవి చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. అయితే అక్కినేని కుటుంబం బ్యాంకు కట్టవలసిన అప్పు విషయంలో ఏం నిర్ణయం తీసుకోనుంది? ఈ ఆస్థిని వదులుకుంటుందా? బ్యాంకుకు చెల్లించాల్సిన డబ్బును చెల్లిస్తుందా అనేది వేచి చూడాల్సిందే.