కోల్ కత్తా పోలీసులు ఆదివారం బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్ర పై కేసు నమోదు చేశారు. శిల్పా శెట్టి కంపెనీలో 9 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు అవి తిరిగి రాకపోవడం పోలీసు కేసు పెట్టినట్టు తెలుస్తోంది. కలకత్తా పోలీసుల సమాచారం ప్రకారం... ఎం.కె.మీడియా ఓనర్ అయిన ఎం.కె.జైన్ శిల్పాశెట్టి కంపెనీలో 9 కోట్ల షేర్స్ తీసుకున్నాడు. ఈ పెట్టుబడిని రెండేళ్ళలో పదింతలు చేస్తామని కంపెనీ చెప్పడంతో ఈ షేర్లు తీసుకున్నట్టు తెలిపారు. కానీ రెండేళ్ళు పూర్తయినా పదింతల మాట దేవుడెరుగు అసలుకే ఎసరు పెట్టడంతో, పోలీసులను ఆశ్రయించినట్టు సదరు మీడియా కంపెనీ ఓనర్ జెయిన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.