అక్షయ్ ‘బేబీ’పై పాక్ లో నిషేధం

January 23, 2015 | 03:52 PM | 31 Views
ప్రింట్ కామెంట్

బాలీవుడ్ చిత్రం 'బేబీ' పై పాకిస్తాన్ లో నిషేధం విధించారు. ఒక భయంకరమైన తీవ్రవాదిని మట్టుపెట్టడం కోసం ఏర్పాటు చేసిన భారత గూఢ చార మిషన్ చుట్టూ కథాంశం తిరుగుతూ ఉంటుంది. ముస్లింలను కించపరిచేలా సన్నివేశాలని చిత్రీకరించడం, విలన్ పాత్రధారులకు ముస్లిం పేర్లు పెట్టడం లాంటి కారణాల వల్ల సెన్సార్ బోర్డు ఈ చిత్రాన్ని పాకిస్తాన్ లో నిషేధించినట్లు డాన్ పత్రిక తెలిపింది. పాకిస్తాన్ కి చెందిన ప్రముఖ టీవీ నటులు మికాల్ జుల్ఫీకర్, రషీద్ రాజ్ ప్రతినాయక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని సీడీలు, డీవీడీలను కూడా ఇస్లామాబాద్ లో నిషేధించారు. ఈ చిత్రం పాకిస్తాన్ కి వ్యతిరేకం కాదని దర్శకుడు నీరజ్ పాండే ఇంతకు ముందే చెప్పారు. పాకిస్తాన్ వ్యాప్తంగా శుక్రవారం విడుదల కావల్సి ఉండగా, ఈ చిత్రాన్ని నిషేధించారు. ఐఎస్ఐ ఏజెంట్లకు సంబంధించి పాత్రలు ఉండడంతో గతంలో సల్మాన్ నటించిన ‘ఎక్ థా టైగర్’ చిత్రాన్ని కూడా పాక్ నిషేధించిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ