ఎన్నాళ్లుగానో పెళ్ళంటూ... షికార్లంటూ... గిఫ్టులంటూ... న్యూస్ పేపర్లలో వెబ్ సైట్లలో వార్తలు హల్ చల్ చేశాయి. చివరికి ఫుల్ స్టాప్ పెట్టే డేట్ రానే వచ్చేసింది. శుక్రవారం 12 గంటలకు త్రిష, వరుణ్ మనియన్ లు వారి కుటుంబ సభ్యుల మధ్య ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. త్రిష దశాబ్ద కాలంగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లో పెద్ద హీరోల సరసన హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు వరుణ్ మనియన్ కు అర్థాంగి కాబోతోంది. ఈ ఎంగేజ్ మెంట్ కార్యక్రమం సంప్రదాయ బద్ధంగా ఇరు కుటుంబాల వారూ జరిపారు. పట్టు వస్త్రాలు, లగ్న పత్రికలు ఇచ్చి పుచ్చుకున్నారు. త్రిష-వరుణ్ లు దండలు, ఉంగరాలు మార్చుకున్నారు. ఇక వివాహ గడియ ఎప్పుడో ఇంకా తెలపాల్సి ఉంది.