అలీ చూపు ప్రొడక్షన్ వైపు

March 10, 2015 | 12:39 PM | 22 Views
ప్రింట్ కామెంట్
ali_comedian_niharonline

అంచెలంచెలుగా ఎదుగుతూ ఇండస్ట్రీలో బలంగా స్థిరపడిపోయిన నటుడు అలీ. ఈయన ఇప్పడు రెండు చేతులా సంపాదిస్తున్నాడనే చెప్పాలి. బుల్లి తెరమీద కొన్ని షోలతో అదరగొడుతూ, అడపాదడపా సినిమాల్లోనూ కనిపిస్తూ ఎప్పుడూ బిజీ బిజీ గా ఉండే అలీకి ప్రొడక్షన్ లో వేలు పెట్టాలనిపిస్తోందట. తనో సొంత బ్యేనర్ పెట్టాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అలీకి నచ్చిన హీరో, హీరోకు నచ్చిన హాస్య నటుడు అని వీరిరువురి అనుబంధం గురించి చాలా సార్లు విన్నాం.. ఇప్పుడు ఆ హీరో పవన్ కళ్యాణ్ తోనే తన ప్రొడక్షన్ హౌజ్ ను ప్రారంభిస్తాడట. మరో సమాచారం ఏంటంటే ఆ హీరోగారితోనే ఈ ప్రొడక్షన్ లో ఓ సినిమా చేయాలనీ... అలీ ప్రొడక్షన్ లో చేయడానికి ఆ హీరోగారు కూడా మాట ఇచ్చినట్టు వార్తలు వచ్చేస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజమనేది అఫీషియల్ న్యూస్ వస్తేగానీ తెలియదు. టాలెంట్ తో పాటు సుడివున్న నటుడు అలీ. రెండు చేతులా సంపాదించిన తన సంపదను నాలుగింతలు చేయాలని ఆరాటపడుతూ ప్రొడక్షన్ వైపు అడుగులేసే ఈయనకు అక్కడ కూడా కలిసి రావాలని కోరుకుందాం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ