స్టార్ హీరో సినిమా అనగానే నిర్మాతలే కాదు, శాటిలైట్ హక్కుల కోసం టీవీ ఛానెల్స్ వారు కూడా పోటీపడుతుంటారు. సినిమా విడుదలకు ముందే ఈ సినిమాల హక్కుల అమ్ముడైపోతాయి. తాజాగా నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం ‘లయన్’ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. తాజా సమాచారం ప్రకారం ‘లెజెండ్’ సినిమా హక్కులను చేజిక్కించుకున్న జెమిని టీవీవారే ‘లయన్’సినిమా శాటిలైట్ హక్కులను చేజిక్కించుకోన్నారట. ఇందుకోసం దాదాపు ఆరు కోట్ల రూపాయలను చెల్లించినట్లు వార్తలు వినపడుతున్నాయి.