నిజమే అవుతుంది మరీ... ఎందుకంటే నరేష్ నటిస్తున్న చిత్రం ''జేమ్స్ బాండ్'' నేను కాదు నా పెళ్ళాం... అనే టైటిల్... ఈ మధ్యే పెళ్ళయిన విరూపను అన్నట్టుగా ఉంది మరి. ఈ మాటలు అల్లరి నరేష్ అంటున్నట్టుగా లేదా? అందుకే ఈ టైటిల్ వల్ల విరూప ఫీలైందట. ఈ టైటిల్ తో ఎందుకు ఫీలవడం అని అందరూ అనుకోవచ్చు... కనీసం సన్నిహితులు, స్నేహితులైనా ఆటపట్టిస్తారుగా మరి... విరూప తో అల్లరి నరేష్ పెళ్లి అని అనుకున్న తర్వాత టైటిల్ ని కన్ఫర్మ్ చేసారు. కానీ ఈ సినిమా మాత్రం రెండేళ్ళ క్రితమే చేయాలని అనుకున్నారట ! పెళ్లి అయ్యాక ఈ టైటిల్ పెట్టడం వల్ల నిజంగానే నేను జేమ్స్ బాండ్ లాంటిదాన్ని అనుకుంటారేమో అని బాగా ఫీల్ అయ్యిందట. ఈ విషయాన్ని అల్లరి నరేష్ స్వయంగా చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో కూడా విరూపను బాగా అల్లరి పట్టిస్తున్నాడు నరేష్. జేమ్స్ బాండ్ చిత్రాన్ని విరూప చూసిందనీ, బాగుందని బాగుందని మెచ్చుకున్నట్టు చెపుతున్నాడు నరేష్. కాగా ఈ సినిమా రేపు (జులై 24)రిలీజ్ అవుతుంది.