కేన్సర్ చిన్నారులకు ఊరటనిచ్చిన బన్నీ...

July 01, 2015 | 02:22 PM | 2 Views
ప్రింట్ కామెంట్
make_aWish_foundation_niharonline(17)

కేన్సర్ తో బాధపడుతూ... రోజులు లెక్కిస్తూ బతుకు పోరాటం చేస్తున్న చిన్నారుల కోరిక తీర్చేందుకు అల్లు అర్జున్ వారి చెంతకు చేరాడు. వారికి కాసింత ఆనందాన్ని ఊరటనూ కల్పించాడు. స్వచ్చంద సంస్థ చొరవతో ఈ చిన్నారుల కోరికను తీర్చాడు అల్లు అర్జున్. ఒక గంట పాటు వారితో సరదాగా గడిపారు. హైదరాబాద్ లోని కేన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు కేన్సర్ చిన్నారులను అల్లు అర్జున్ బుధవారం కలుసుకుని ముచ్చటించారు. ఈ చిన్నారులు అల్లు అర్జున్ తో ఉల్లాసంగా గడిపారు. అనంతరం వారి యోగ క్షేమాలను వైద్యులతో పాటు వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అల్లు అర్జున్ ఈ సందర్భంగా ఆరుగురు చిన్నారులకు గిఫ్ట్ లు అందించాడు.  ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ ‘‘ఈ చిన్నారుల కోసం తన సమయం కేటాయించడం పెద్ద విషయమేమీ కాదు. వారి ముఖాల్లో చిరునవ్వు చూసేందుకు ఇక్కడికి వచ్చాను. గతంలో ఇలాంటి పిల్లల విషయం తనకు తెలిసింది. అప్పుడు నేను షూటింగ్ తో విదేశాల్లో ఉన్నాను. వచ్చాక ఆ విషయం మర్చిపోయాను. వారి కోరిక తీరకుండానే వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళాపోయారు. సెలబ్రిటీలందరూ... ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా స్పందించి వారి కోరికను తప్పకుండా తీర్చాలని కోరుకుంటున్నా...’’నని చెప్పారు. ఇక నుంచి ఇలాంటి వారు ఎవరైనా పిలిస్తే తప్పకుండా వెళతానని, తన చేతనైన సహాయం చేస్తానని అల్లు అర్జున్ తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ