తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందట...

July 01, 2015 | 01:21 PM | 2 Views
ప్రింట్ కామెంట్
radhika_apte_goodbye_to_telugu_movies_niharonline

తెలుగులోనూ లెజెండ్, లయన్ చిత్రాల ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది రాధిక ఆప్టే. రెండు సినిమాలతో తెలుగు హీరోలన్నా, డైరెక్టర్లన్నా ఈవిడకు గిట్టడం లేదట. ఇక్కడి కొందరు దర్శక నిర్మాతలకు స్త్రీలపై గౌరవమే లేదంటూ దుయ్యబడుతోంది. హీరోల ఆధిక్యం అధికం అంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ మాటలు ఇంతకుముందే అన్నది రాధికా ఆప్టే అయితే కొత్త విషయం ఏమిటంటే ఈ కారణంతో ఆమె పలు అవకాశాల్ని కాలదన్నుతోంది. ఈవిడకు ఇక సౌత్ లో ఏ సినిమాలూ లేక పోవడంతో ప్రస్తుతం తన దృష్టిని బాలీవుడ్‌పై సారిస్తోంది. ఇక ఈవిడ తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పినట్టేనని సినిమాలకు ఆఫర్ చేసిన దర్శకనిర్మాతలు అంటున్నారు. అన్నట్టు ఈ భామ ఇటీవల ఒక హాలీవుడ్ చిత్రంలోనూ నటిస్తోందట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ