అల్లు అర్జున్, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో సినిమా రాబోతోందట. ఫిల్మ్ నగర్ లో ఇది నిజమనే టాక్ వినిపిస్తోంది. శేఖర్ కమ్ముల సినిమాలన్నీ సామాన్యమైనవి. కమర్షియల్ చిత్రాల జోలికి ఆయన ఇప్పటివరకు వెళ్ళ లేదు. మరి అర్జన్ తో ఆయన తీసే సినిమా ఏ లెవల్ లో ఉంటుంది? ఇదే చర్చ. అల్లు అర్జున్ సినిమాలన్నీ ఒక రేంజ్ లోనే ఉంటాయి. మరి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా అంటే అందరిలోనూ క్యూరియాసిటీ బాగా పెరిగిపోతోంది. ఇటీవల వీరిద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని, సరికొత్త పాయింట్‌తో శేఖర్‌కమ్ముల చెప్పిన కథ నచ్చడంతో అల్లు అర్జున్ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని త్వరలో వెల్లడించనున్నారు. ఈ సంవత్సరాంతంలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. దీనికి సల్మాన్‌ఖాన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.