ఇదేదో తేడా తేడాగా వినిపిస్తోంది కదా... ! అవును స్టార్ టైటిల్స్ తారు మారయ్యాయి. ఇద్దరు నటులూ చాలా టాలెంటెడ్ తమకు ఎంత ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా తమ ఓన్ టాలెంట్‌తో ఇండస్ట్రీని ఏలేస్తున్న వారు. కానీ ఒక ట్రెండ్ ను ఫాలో అవుతూ వస్తున్న ఈ నటులిద్దరూ ఇప్పుడు కొద్దిగా ట్రెండ్ మార్చేశారు. ఫ్యామిలీ అండతో తొలి సినిమాలో ఎంట్రీ ఇచ్చుకున్నా... ఆ తరువాత టాలెంట్ లేనిది ఎవరూ నిలదొక్కుకోలేరు. ఆ విషయాలన్నీ అలా పక్కన పెడితే జూనియర్ ఒక మాస్ బాస్‌గా సెటిలైతే, అలంలె అర్జున్ ఒక స్టయిలిష్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇటు బన్నీ అటు, ఎన్టీఆర్ ఇటు వచ్చేశారిప్పుడు. తారక్ అక్కడ సుకుమార్ కోసం స్టయిలిష్‌గా రెడీ అవుతుంటే.. బన్నీ బోయపాటి శ్రీను సినిమా కోసం మాస్ రోల్ చేయడానికి రెడీ అయిపోతున్నాడు. అక్కడ క్లాస్ సుకుమార్‌తో ఎన్టీఆర్ డీల్ సెట్ చేసుకుంటే, ఇక్కడ మాస్ కింగ్ బోయపాటి శ్రీనుతో బన్నీ తన తదుపరి ప్రాజెక్టును స్టార్ట్ చేస్తున్నాడు. మొత్తానికి ఈ స్టార్ హీరోలిద్దరూ ట్రెండ్ మార్చుకుని సక్సెస్ చూపించాలనే కాంక్షతో ఉన్నారు. ఇద్దరూ తమ సినిమాలను సంక్రాంతికి దించే ప్లానింగ్ తో ఉన్నట్టు తెలుస్తోంది.