మన తెలుగు సినిమాల్లో స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు తక్కువే... రాజమౌళి సైలో రగ్బీ, ఒక్కడులో కబడ్డీ, తరువాత కబడ్డీ కబడ్డీ లాంటి సినిమాలకు స్పోర్ట్స్ టచ్ ఇచ్చారు. స్టోరీ కొద్దిగా మిక్స్ చేస్తే చాలా ఆసక్తిగా కరంగా ఉంటాయి స్పోర్ట్స్ సినిమాలు. బాలీవుడ్ లో అయితే రియలిస్టిక్ గా అనిపించే కొన్ని సినిమాలు వచ్చాయి. క్రికెట్ నేపథ్యంలో లగాన్ తీసి దేశం మొత్తానికి పిచ్చెక్కించాడు అమీర్ ఖాన్. షారుఖ్ ఖాన్ హీరోగా హాకీ మీద తీసిన ‘చక్ దే ఇండియా’ అప్పట్లో పెద్ద సంచలనం. ఆ తర్వాత గోల్ బాగ్, మిల్కా బాగ్ మేరీకోమ్ లాంటి సినిమాలు కూడా జనాల్ని ఆకట్టుకున్నాయి. స్పోర్ట్స్ సినిమా అనగానే యూత్ ఆటోమేటిగ్గా కనెక్టయిపోతారు కాబట్టి. ఆసక్తికరంగా తీయగలిగితే మంచి మార్కెట్ ఉంటుంది. అవి మంచి విజయం సాధిస్తాయి. మన జాతీయ ఆట కబడ్డీకి బ్రాండ్ అంబాసిడర్ అయిన అల్లు అర్జున్ స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే సినిమాలో చేయాలని ఉందట. అలాంటి సినిమా కథాంశమేదైనా ఉంటే తాను నటించడడానికి రెడీ అని అంటున్నాడు ఇటీవలే ఆరంభమైన ‘ప్రొ కబడ్డీ లీగ్’కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న బన్నీ, స్పోర్ట్స్ మూవీ పట్ల తన ఆసక్తిని వెల్లడించాడు. ‘‘కబడ్డీ మనదైన క్రీడ. మన సంస్కృతిలో భాగం. చిన్నపుడు కబడ్డీ బాగా ఆడేవాణ్ని. కానీ తర్వాత మానేశా. సినిమాల తర్వాత నేను ఆసక్తిగా చూపించేది క్రీడలే. ఎవరైనా మంచి కథ చెబితే క్రీడా నేపథ్యంలో సినిమా చేయడానికి నేను రెడీ. కానీ కథ పక్కాగా ఉండాలి’’ అంటున్నాడు అర్జున్. మంచి స్పోర్ట్స్ ఫిజిక్ ఉన్న అర్జున్ తో ఇలాంటి సినిమా తీయాలనే ఆలోచన ఇంతవరకూ ఏ డైరెక్టర్ కూ ఎందుకు రాలేదో గానీ తను ఇచ్చిన ఆఫర్ ను ఉపయోగించుకుంటే ఓ సక్సెస్ సినిమా తయారవుతుందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.