విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తూ తర్వాత కూడా అదే ఊపును కొనసాగించి, ప్రస్తుతం కొనసాగిస్తున్న ఏకైక చిత్రం బాహుబలి. హాలీవుడ్ దృష్టి, దిష్టి పడేలా మొట్టమొదటిసారిగా ఓ దక్షిణాది చిత్రం 400 కోట్ల క్లబ్ లోకి దూసుకెళ్తుడం ఇదే ప్రథమం. అయితే ఇప్పుడు బాలీవుడ్ లో ఒక ఆసక్తికర టాపిక్ పై చర్చ జరుగుతోంది. అదే బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ భజిరంగి బాయ్ జాన్, బాహుబలి రెండింటిలో ఏది తోపని? రెండింటికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాదే కథ అందించడం, రెండూ హిట్ టాక్ తో దూసుకుపోవటం పక్కనబెడితే కలెక్షన్లపరంగా ఇప్పుడు చర్చ మొదలైంది. బాహుబలి విడుదలైన వారానికి భజిరంగి బాయ్ జాన్ థియేటర్లలో వాలి హిట్ టాక్ తోనే దూసుకుపోతుంది. అంతేకాదు కంటెంట్ పరంగా బాహుబలి కన్నా భజిరంగి నే బావుందని సినీ విమర్శకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇగోను పక్కన బెట్టి సల్మాన్ ఖాన్ నటించడం నిజంగా గ్రేట్. అయితే ఫస్ట్ వీక్ లో బాహుబలి కలెక్షన్ల్ ముందు భజిరంగి చాలా వెనుకబడిపోయింది. తాజా లెక్కల ప్రకారం తొలి ఆరు రోజుల్లో బాహుబలి కలెక్షన్ దాదాపు 285 కోట్లు, అదే సమయంలో భజిరంగి చిత్రం కేవలం 169 కోట్లతో సరిపెట్టుకుంది. భజిరంగి బాయ్ జాన్ ప్రపంచవ్యాప్తంగా మొత్తం 6000 థియేటర్లలో విడుదల కాగా, బాహుబలి కేవలం 4 వేల థియేటర్లలోనే విడుదలైంది. పబ్లిసిటీ పరంగా బాహుబలికే ఎక్కువ హైప్ తెచ్చినప్పటికీ అవతల ఉంది సల్మాన్ కావటంతో ఆయన ప్రభంజనం ముందు రికార్డులన్నీ కనుమరుగై పోతాయని జనాలంతా భావించారు. కానీ అలా జరగలేదు. ఇక్కడ ఓ దక్షిణాది చిత్రానికి ఇంత క్రేజ్ తెచ్చిన ఘనత రాజమౌళిదే. అయినప్పటికీ దేశవ్యాప్తంగా దీనికి క్రేజ్ రావటానికి కారణం మాత్రం కరణ్ జోహరే. ఆది నుంచి తన సొంత సినిమాలా ఫీలవుతూ చిత్రానికి మంచి హైప్ తేవటంలో కరణ్ కృషి మరువలేనిది. ఇక బడ్జెట్ విషయాన్ని పక్కనబెడితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ప్రస్తుతానికి బాహుబలి కింగ్ అన్న మాట.