ఇటీవలే మూడు ముళ్లు వేయించుకున్న అమలపాల్ కు చేదు అనుభవం ఎదురైంది. తను నటించే జ్యువెలరీ యాడ్ కు సంబంధించి ఒక కోర్టు నోటీసు ఆమెకు వచ్చిపడింది. ఒక జ్యువెల్లరీ కంపెనీ (కొచ్చి) తన కంపెనీ ప్రమోట్ కోసం అమలను అడ్వర్ టైజ్ మెంట్ ఫిల్మ్ లో నటించేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. దీనికి రెమ్యునరేషన్ గా 30 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించి కాంట్రాక్టు సంతకాలు చేయించుకుంది. దీనిప్రకారం అమల వేరొక జువెలరీకి ఎట్టి పరిస్థితిలోనూ పని చేయకూడదు. కానీ అగ్రిమెంట్ ను కాదని అమల వేరొక (పత్తనపురం) జ్యువెలరీ బ్రాండ్ లో నటించేందుకు సిద్ధమయ్యిందట. ఒళ్ళుమండిపోయిన కొచ్చి ఓనర్స్ అమల గురించి కోర్టుకు వెళ్ళారు. దీంతో కోర్టు అమలను పత్తనపూర్ జువెలరీ యాడ్ లో నటించకూడదనీ, ముందుగా అగ్రిమెంట్ చేసుకున్న కాంట్రాక్టు రద్ధయ్యేంతవరకూ ఇంకొకదానిలో నటించ కూడదని అభ్యంతర పెట్టింది. అనుకోని పరిస్థితిలో ఇచ్చిన డేట్స్ ప్రకారం సినిమా పూర్తి కాకపోతే, కండిషన్ ప్రకారం తీసుకున్న రెమ్యునరేషన్ కు ఇచ్చిన డేట్స్ కు సరిపోయిందనీ, మళ్ళీ డేట్స్ కావాలంటే మరికొంత సొమ్ము చెల్లించాలని రూల్స్ మాట్లాడే ఇలాంటి సినిమా వాళ్ళే ఎంత అవకాశ వాదం ప్రదర్శిస్తారో చూడండి. ఎవరైనా ఎక్కువ సొమ్ము ఇస్తామంటే ముందుగా కుదుర్చకున్న అగ్రిమెంట్ కు నీళ్ళొదులుతారా? ఇదేం న్యాయం? అని చూస్తున్నవారంతా అంటున్నారు. మరీ ఇది పద్ధతేనంటావా అమలా...