అభినందనలు ఎవరికో అర్థమైపోయింది కదా...! అమీర్ ఖాన్ గురించే... పీకే తరువాత దంగల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే... ఈ సినిమా కోసమూ ఎన్నో కసరత్తులు చేస్తున్నాడట ఆయన. ఐ సినిమాలో విక్రమ్ లాగా... బాహుబలిలో ప్రభాస్ లాగా... ఆయన హార్డ్ వర్క్ ను, సినిమాల్లో ఆయన పాత్ర తీరును బట్టే ఆయనకు మిస్టర్ పర్ ఫెక్ట్ అనే పేరు వచ్చిందన్న సంగతి అందరికీ తెలిసిందే. గత ఐదారు సినిమాల్ని వరుసలో పెట్టి చూస్తే.. ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు. ఆ సినిమాల్లో పాత్రలే కనిపిస్తాయి తప్ప అమీర్ కనిపించడు. పాత్ర కోసం తనను తాను ఎలాగైనా మలుచుకుంటాడాయన. పీకేలో సరికొత్త అవతారం కనిపించిన అమీర్.. మహవీర్ పొగట్ అనే రెజ్లర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా నే దంగల్. ఈ సినిమా కోసం ఆరు నెలల ముందు నుంచే తినడమే పనిగా పెట్టుకున్నాడట. ఈ సినిమాలో రెండు పాత్రల కోసం రెండు భిన్నమైన అవతారాల్లో కనిపించాల్సి ఉంది. ఒకటి భారీ శరీరంతో ఇంకోటి కండలు తిరిగిన రెజ్లర్ గా. దీని కోసం అమీర్ అలా మెక్కేస్తున్నాడట. కొన్ని నెలల కిందటే అమీర్ బాగా బరువెక్కి కనిపించాడు. తాజాగా ప్రొ కబడ్డీ లీగ్ కోసం వచ్చినపుడు మిస్టర్ పర్ఫెక్షనిస్టుని చూస్తే జనాలకు మతిపోయింది. ముందున్న దానికంటే పాతిక కిలోల దాకా బరువెక్కి ఓ వంద కిలోలకు రీచ్ అవుతున్నట్టు కనిపించాడు అమీర్. ఓవైపు పాత్ర కోసం శారీరకంగా తయారవడమే కాదు.. ఇక బయో పిక్ సినిమాలకు ఆ పాత్రకు సంబంధించిన వారి సన్నిహితులను, బంధువులను కలవడం మామూలే. అలా పొగట్ కుటుంబ సభ్యుల్నీ కలుస్తున్నాడు అమీర్. పొగట్ కూతుళ్లు ప్రస్తుతం రెజ్లింగ్ లో ఉన్న బబిత, గీతలను కలిసి వారి తండ్రి గురించి వాళ్ల కెరీర్ గురించి తెలుసుకుంటున్నాడట. ఇలా బరువెక్కి, మళ్ళీ నాలుగు నెలల్లో దిగిపోయిన మళ్ళీ కండలతో కనిపించే మరో పాత్రకు రెడీ అయిపోవాలట. మరీ శరీరాన్ని ఇంత ఇబ్బంది పెడితే... భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయేమో అమీరూ...!