బిగ్ బీ ట్విట్టర్లో బూతు బొమ్మలు

August 31, 2015 | 12:37 PM | 4 Views
ప్రింట్ కామెంట్
amitabh-bachchan-twitter-hacked-porn-videos-photos-niharonline.jpg

సోషల్ మీడియా సైట్లలో స్టార్ల్ సందడి ఎలా ఉంటుందో మనం రోజు చూస్తూనే ఉన్నాం. బడా చోటా స్టార్లు తేడా లేకుండా ఇప్పుడు అందరూ తమ తమ మాధ్యమాలను వాడుకుని సినిమాలను ప్రమోట్ చేసుకోవటంతోపాటు ఫ్యాన్స్ తో పిచ్చాపాటిగా సరదాగా గడుపుతున్నారు. అయితే తరచూ వారి సైట్లు హ్యాక్ కి గురవ్వటం కూడా మనం చూస్తుంటాం. బాగా ఫాలోయింగ్ ఉన్న వారు కావటంతో అడ్డమైన వీడియోలను, ఫోటోలను చేర్చి పైశాచిక ఆనందం పొందుతుంటారు హ్యాకర్లు. దీనికి బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఇందుకు మినహాయింపు ఏం కాదు. ఆయన ట్విట్టర్ కు ఆయనకున్నంత ఫాలోయింగ్ ఉంది. అభిమానులు కూడా ఆయనను అక్కడ అంతగా ఫాలోఅవుతారు. అంతటి ప్రజాదరణ ఉన్న ఆయన అకౌంట్ లో సోమవారం ఉదయం బూతు బొమ్మలున్న వీడియోలు దర్శనమిచ్చాయి. బిగ్ బీ లాంటి బడా స్టార్ పేజీలో పోర్న్ వీడియోలు అప్ లోడ్ కావటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే అభిమానులు చూసే కంటే ముందే అమితాబ్ వాటిని గమనించి తొలగించేశారట. కాసేపటి క్రితం ‘‘ నా ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ కు గురైంది. అందులో కొన్ని బూతు బొమ్మలు చేరిపోయాయి. నాకు వాటితో అవసరం లేదు అంటూ ఆయన ట్వీటాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ