విభిన్న పాత్రలను పోషించిన తెలుగు హీరోల్లో జగపతి బాబును కూడా చెప్పుకోవచ్చు. ఆయన హీరోగా చేయడంతో అంత:పురం లాంటి సినిమాలో చాలా డిఫెరెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇప్పుడు విలన్ గా కూడా నటిస్తున్నారు. ‘లెజెండ్’ సినిమాలో నెగెటివ్ షేడ్ లో ఆకట్టుకున్న జగపతి బాబు, అక్కడితో ఆగిపోకుండా శ్రీమంతుడులో మహేష్ బాబుకు తండ్రిగా కూడా నటించారు. ఇక ఎన్టీఆర్-సుకుమార్ సినిమాలోనూ నటిస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ ‘హితుడు’లో హీరోగా వస్తున్నాడు. ఈ సినిమా గురించి జగపతి బాబు ఇంతకుముందే చెప్పారు. మూడు షేడ్స్ లో ఇందులో నటిస్తున్నాననీ,
టీచర్ గా, మావోయిస్టుగా కనిపిస్తాడట. ఇదొక సామాజిక బాధ్యతా ఉన్న సినిమా అని తెలుస్తోంది. కే.ఎస్.వి. నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో మీరా నందన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ చిత్రాన్ని అక్టోబర్ మొదటి వారంలో విడుదల చేయబోతున్నట్టు చిత్ర నిర్మాత కేఎస్వీ ఒక ప్రకటనలో తెలిపారు. ఖచ్చితమైన తేదీని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. కొత్త దర్శకుడు విప్లవ్ దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టే ఈ చిత్రంలో జగపతి బాబుతో పాటు, బెనర్జీ సీ వీ ఎల్ ఇతర పాత్రల్లో చేస్తున్నారు. అరకు లో ఎక్కువ భాగం చిత్రీకరించిన ఈ చిత్రం లోని కొన్ని సన్నివేశాలను వైజాగ్ హైదరాబాద్ లలో వివధ లొకేషన్ లలో పూర్తి చేశారట. చిత్రం లోని అయిదు పాటలు అనంత శ్రీ రామ్ రచించగా కోటి సంగీతం ఆందించారు. భరణి కె ధరన్ చాయాగ్రహణం అందించగా ధర్మేంద్ర కాకరాల ఎడిట్ చేశారు. త్వరలో ఈ చిత్రం ఆడియో విడుదల చేయనున్నట్టు నిర్మాత కేఎస్వీ తెలిపారు. ప్రముఖ నిర్మాత మధు మురళి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.