వెండితెరపై స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఐశ్వర్య రాయ్ ఆ తర్వాత తన కన్నా చిన్నవాడైన అభిషేక్ ను పెళ్లిచేసుకుని బచ్చన్ ఫ్యామిలీలో బాగానే సెటిల్ అయిపోయింది. ఐదారేళ్ల గ్యాప్ తర్వాత తాజాగా రీఎంట్రీని ప్రారంభించేసింది కూడా. ఒక బిడ్డకు తల్లిగా, ఓ భార్యగా, అంతకు మించి ఓ మంచి కోడలిగా ఐష్ వంద మార్కులు కొట్టేసిందని ఆమె మామ బిగ్ బీ ట్విట్టర్లో ఎప్పుడూ ప్రశంసిస్తూ ఉంటాడు. ఇక తన మనవరాలు, అభిషేక్, ఐశ్వర్యల గారాల పట్టీ ఆరాధ్య భవిష్యత్తుపై కూడా ఇప్పుడు అమితాబ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తన తదుపరి చిత్రం 'వాజిర్' ప్రమోషన్ సందర్భంగా ట్వీట్లు చేస్తున్న టైంలో హఠాత్తుగా తన మనవరాలు గురించి చెప్పటం మొదలు పెట్టాడు. పెరిగి పెద్దయిన తరువాత తన మనవరాలు ఆరాధ్య, తనకు మంచి స్నేహితుడు షారూక్ ఖాన్ కుమారుడు అబ్రామ్ లు కలిసి వెండితెరపై కనిపిస్తే చూసేందుకు బాగుంటుందని అన్నారు. ప్రస్తుతం రణబీర్ - దీపిక, అలియా - సిద్దార్థ్, ఫవాద్ - సోనమ్ ల జంట మాదిరిగా, ఆరాధ్య - అబ్రామ్ లు కనిపిస్తారని ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో వ్యాఖ్యానించారు. ఆరాధ్య కన్నా అబ్రామ్ చిన్నవాడని కాజల్ గుర్తు చేయగా, "ప్రేమకు వయసుతో నిమిత్తం లేదు" అని షారూక్ వ్యాఖ్యానించాడు. ఇదే విషయంపై బచ్చన్ స్పందిస్తూ, "ఆయన నోట్లో నెయ్యి, దూధ్ మలాయ్ వెయ్యాలి, అతని వ్యాఖ్యలే నిజం కావచ్చు" అన్నారు.