బబ్లీకి నచ్చితే ఏమైనా చేస్తుంది

January 02, 2016 | 05:33 PM | 2 Views
ప్రింట్ కామెంట్
rashi khanna about story selection niharonline

అందం ఉంది అయితేనేం ఇండస్ట్రీలో వరుస ఫ్లాప్ లతో ఆమెపై ఐరెన్ లెగ్ మార్క్ పడింది. దీంతో గ్లామర్ డోస్ పెంచేసింది. బెంగాల్ టైగర్ లో ఏకంగా బికినీ ఫీట్ కి దిగింది. కొంచెం సక్సెస్ అయ్యింది. అసలు తనకసలు మొహమాటమే లేదంటోంది లేత సోయగాలభామ రాశిఖన్నా. అదేమరీ సినిమాలు ఒప్పుకునే విషయంలోనండీ! "అవును, నాకు కథ నచ్చాలి. అలా నచ్చినప్పుడే కొత్త సినిమాకి సంతకం చేస్తాను. మనసుకి నచ్చకపోతే మాత్రం చేయను" అని చెప్పింది.

"ఇతర విషయాల్లో మనం రాజీ పడచ్చు కానీ, సినిమా విషయంలో రాజీపడితే నష్టపోయేది నేనే. ఇష్టం లేని సినిమా ఒప్పుకుంటే మనసు పెట్టి నటించలేం. అందుకని మనస్కరించని కథల విషయంలో ఎటువంటి మొహమాటం లేకుండా చెప్పేస్తాను. ఇంతవరకు అలాగే వున్నాను కూడా" అంది ఈ ముద్దుగుమ్మ. 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది ఆ తర్వాత అరడజను సినిమాలలో నటించింది. ప్రస్తుతం మాత్రం సాయిధరమ్ తో సుప్రీంలో పోలీసాఫీసర్ గెటప్ లో చించేస్తుందట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ