ఆలీ కోసం అమీ తెగ కష్టపడుతోంది

May 02, 2016 | 02:30 PM | 3 Views
ప్రింట్ కామెంట్
Amy-Jackson-Hindi-Tutor-for-Ali-niharonline

లండన్ నుంచి దిగుమతి అయి ఇక్కడ అన్ని భాషల్లో హీరోయిన్ గా ఛాన్స్ లు కొట్టేస్తుంది అమీ జాక్సన్. ప్రస్తుతం రజనీ సరసన రోబో-2 లో నటిస్తున్న ఈ మోడల్ భామ మరోవైపు ఇతర భాషలపై కూడా దృష్టిసారించింది. బన్నీ విక్రమ్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం కోసం ఓ హీరోయిన్ గా ఎంపికైన అమీ, మరోవైపు హిందీలో కూడా మంచి ఛాన్స్ లే కొట్టేస్తుంది. ప్రస్తుతం హిందీలో మాట్లాడేందుకని బాలీవుడ్ నటి ఎమీ జాక్సన్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అలీ’లో ఎమీ జాక్సన్ నటిస్తోంది. ఈ చిత్రంలో డైలాగ్ లు చెప్పే సమయంలో కొంత తడబడవలసి వస్తోందట. దీంతో ఏకంగా ఓ హిందీ ట్యూటర్ ను నియమించుకున్నట్లు చెప్పింది. డైలాగ్ లు చెప్పే విషయంలో ‘అలీ’ చిత్ర దర్శకుడు సొహైల్ ఖాన్, నటుడు నవాజుద్దీన్ ల సాయం తీసుకుంటున్నానని, హిందీ నేర్చుకోవడం కొంచెం కష్టంగానే ఉందని, అయితే, నేర్చుకోవాలన్న తపన కూడా ఉందని ఈ బికినీ బ్యూటీ చెప్పుకోస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ