ఆర్య ప్రభాస్ కన్నా ఎక్కువ లాగించేస్తున్నాడు

May 01, 2016 | 01:13 PM | 5 Views
ప్రింట్ కామెంట్
Aarya-body-mogwli-type-character-selva-raghava-movie-niharonline

కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటారు వారికేం అనుకుంటారు అంతా. కానీ, ఓ సినిమా కోసం ఎంత కష్టపడాలో అంత కష్టం పడుతూనే ఉంటారు. స్లిమ్ గా, ఫిట్ గా కనపడడం కోసం మన హీరోలు, హీరోయిన్లు తక్కువ డైట్ తీసుకుంటారు. ఆ క్రమంలో తమకు ఇష్టమైన ఆహార పదార్థాలను ఎన్నింటినో పక్కన పెట్టేస్తుంటారు కూడా. అదే టైంలో లావుగా కనిపించేందుకు తెగ లాగించేస్తుంటారు కూడా. ఆ మధ్య బాహుబలి కోసం ప్రభాస్ మెనూ చూసి అంతా షాకయ్యారు. ప్రస్తుతం తమిళ నటుడు ఆర్య ఇప్పుడు ఫుడ్డుని ఓ పట్టుపడుతున్నాడు. రోజుకి 40 కోడిగుడ్లు లాగించేస్తున్నాడు. అంతేకాదండోయ్, రెండు కిలోల కోడి మాంసాన్ని కూడా గుటకాయస్వాహా చేసేస్తున్నాడు. ఇదంతా ప్రస్తుతం రాఘవ దర్శకత్వంలో తాను నటిస్తున్న తాజా తమిళ చిత్రం కోసమట!

                                                         ఈ చిత్రంలో ఆర్య జంగిల్ బుక్ మొగ్లీ తరహాలో అడవిమనిషి పాత్రను పోషిస్తున్నాడు. దాంతో మనిషి కండలు తిరిగి భారీకాయంతో కనిపించాలి. అందుకోసం దర్శకుడి సూచనల మేర ఇలా తిండిపోతు అవతారం ఎత్తాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తమిళనాడు, కేరళ అటవీ ప్రాంతాలలో జరుగుతోంది. అందుకోసం జిమ్ సరంజామాను కూడా తన వెంట ప్రత్యేకమైన వ్యానులో తీసుకువెళ్లాడు. అలాగే, సాయంకాలం వేళల్లో చెప్పులు లేకుండా అడవిలో తిరగటం, గంట పాటు అక్కడి కొండలు ఎక్కి దిగడం చేస్తున్నట్టు కూడా ఆర్య తెలిపాడు. కేథరిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కిక్ శ్యాం కూడా ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. నవంబర్ కల్లా పూర్తి చేసి డిసెంబర్ లో చిత్రాన్ని రిలీజ్ చేయాలని రాఘవ భావిస్తున్నాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ