``అమ్మాయిలు ఆ దారెంబటి పోతారని తెలిసి మీ నాన్న తన స్నేహితులతో కాపుకాసిన రోజుల గురించి చెప్పారా ఎప్పుడైనా..
ఆయనకు తెలీకుండా మీరు మీ గర్ల్‌ఫ్రెండ్స్ ని కలిసే ప్లేసెస్ గురించి ఎప్పుడన్నా ఆయనతో చెప్పారా.. అసలెక్కడ కలుస్తారు.. ఏ టైములో కలుస్తారు.. ఎవరెవరు కలుస్తారు.. ఎంతసేపు ఉంటారు... ఏం మాట్లాడుకుంటారు..ఈ డీటెయిల్స్ వొద్దుగానీ.. అక్కడ దిగిన గ్రూప్ సెల్ఫీలుంటే లేదా దిగి పంపించండి.. మీ కాలేజీ వొదిల్తే కలిసే ప్లేసు.. కంబైండ్ స్టడీస్ కోసం కలిసే ప్లేసు.. ఫ్రెండ్స్‌తో గప్పాలు కొట్టే ప్లేసు.. మధ్యలో ఆకలేస్తే గోల్‌గప్పాలు తినే ప్లేసు..మెర్క్యురీ కేఫయినా.. మెక్డీ రెస్టారెంటయినా.. ఐమాక్సు థియేటరయినా.. ఆపక్క నెక్లెస్ రోడ్డయినా..రోడ్డెక్కి తిరగండి.. సెల్ఫీలు దిగండి.. ఇక్కడ పోస్టు చేయండి.. లైకులు తెచ్చుకోండి.. ప్రైజులు కొట్టేయండి.. ఈ కాంటెస్టు పన్నెండు రోజులుంటుంది.. ఏప్రిల్ పదిహేను నుంచి ఏప్రిల్ ఇరవై ఆరు వరకు..రోజుకో విన్నరు.. మొత్తం మీద ఒక గ్రాండ్ విన్నరు..గుర్తుంచుకోండి.. విన్నింగ్ క్రైటీరియా కేవలం మీ సెల్ఫీకొచ్చిన లైకులు మాత్రమే..`` అని అంటున్నారు ఆంధ్రాపోరి యూనిట్. పూరి తనయుడు ఆకాష్ నటిస్తున్న సినిమా ఇది. రాజ్ మాదిరాజు దర్శకుడు. ప్రసాద్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. రమేష్ ప్రసాద్ నిర్మాత.